లింగాపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ పరసా రాజారావు సొంగా రోషన్ మరియు కూటమి అధికారంలోకి రావడం కోసం స్థానిక కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మొక్కుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం ఆ మొక్కు చెల్లింపు కార్యక్రమంలో భాగంగా కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్నిఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.