జంగారెడ్డిగూడెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.