సీఎం చంద్రబాబు సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ప్రతి ఒక్కరీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం చింతలపూడిలో కోరమేనుల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చింతలపూడి మండలం ఎంపిక చేశారు. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.