అటవీ శాఖ అధికారి చేతిలో తీవ్రంగా గాయపడిన మడకం రాజేష్ అనే గిరిజనుడు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. జరిగిన ఘటనను రాజేష్ వద్ద అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని బాధితుడికి సరైన వైద్యం అందించాలని సూచించారు.