ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం కూటమి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని అన్నారు.