టి నర్సాపురం మండలం రాజు పోతేపల్లి అడ్డరోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కామవరపుకోటకు చెందిన ఓ పాఠశాల బస్సు విద్యార్థులను దింపి వెళుతున్న సమయంలో టీ నర్సాపురం మండలం రాజుపోతేపల్లి అడ్డరోడ్డు దగ్గర అదుపుతప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.