జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఎస్సై జాబిర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులర్పించారు. అయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ రచనతో దేశ భవిష్యత్ కు దిశ నిర్దేశం చేశారని, ఒక గొప్ప విద్యావేత్త, మేధావి అని గుర్తు చేశారు.