చింతలపూడి పోలీస్ వారి హెచ్చరిక

66చూసినవారు
చింతలపూడి పోలీస్ వారి హెచ్చరిక
చింతలపూడి మండల ప్రజానీకానికి పోలీసువారు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాలు, పేకాట, గుండాట, జూద క్రీడలు ఆడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కుటుంబరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులను పాటిస్తూ గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్