చింతలపూడిలో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుండి డ్యూటీ పెయిడ్ 7 మద్యం సీసాలను గుర్తించామని సీఐ అశోక్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సదరు మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్సైలు అబ్దుల్ ఖలీల్, జగ్గారావు వారి సిబ్బంది ఉన్నారు.