యర్రంపేటకు చెందిన రాపాక కల్యాణ్(26) సోమవారం ద్విచక్రవాహనంపై జంగారెడ్డిగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా కొయ్యలగూడెం సమీప నీలాలమ్మ గుడి వద్ద కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.