విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన 108

59చూసినవారు
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన 108
రోగులను ఆస్పత్రికి తీసుకెళుతుండగా 108 వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో రోగులకు, వాహన సిబ్బందికి గాయాలయ్యాయి. కైకరం గ్రామం నుంచి కె. అర్జున్, ఎస్. జయ అనే రోగులను డయాలసిస్ కోసం ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా. దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద 108 వాహనం అదుపుతప్పి రహదారి మార్జిన్ లో ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొంది. ఈ ప్రమాదంలో రోగులకు, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్