జూద శిబిరంపై దాడి 12 మంది అరెస్ట్

64చూసినవారు
జూద శిబిరంపై దాడి 12 మంది అరెస్ట్
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో జూద శిబిరంపై మంగళవారం పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 42, 800 నగదుని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే స్టేషన్ పరిధిలో జూద క్రీడలు ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్