టీడీపీ శ్రేణులకు మహానాడు పెద్దపండుగ లాంటిది. ఏడాదికోసారి వచ్చే మహానాడు కోసం తెలుగుతమ్ముళ్లు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ మహానాడు తన జీవితంలో గుర్తిండిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మహానాడుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కారును కొని, దాని రూపురేఖలు మార్చేశారు. ఆ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.