దెందులూరు: అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలు ప్రారంభం

78చూసినవారు
దెందులూరు: అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలు ప్రారంభం
దెందులూరు మండలం గాలాయిగూడెంలోని శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి 68వ వార్షిక మహోత్సవాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ నేటి నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఘనంగా జరగనున్న అమ్మవారి ఉత్సవాలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆలయ కమిటీ నిర్వహకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్