అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దెందులూరు మండలం సోమవరప్పాడులో కోకో రైతులు శనివారం ధర్నా చేపట్టారు. మోండలిజ్ కార్యాలయం ముందు రైతులు నిరసన తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరికి విశ్రాంతి డీజీ ఏబీ వెంకటేశ్వరరావు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.