దెందులూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఆకుల మణికంఠకు చెందిన 15 ఎకరాల గడ్డివాము కాలిపోయింది. సోమవారం అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్ధ స్థలాన్ని పరిశీలించారు. ఆయన పశుసంవర్ధక శాఖ జేడీతో మాట్లాడి నాలుగు టన్నుల ఫీడును రాయితీపై ఇవ్వాలని కోరారు. అలాగే రెండు ట్రాక్టర్ల గడ్డిని వ్యక్తిగతంగా అందిస్తానని హామీ ఇచ్చారు.