దెందులూరు: మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
పెదవేగి మండలం వంగూరులో ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.