సమిష్టి కృషితోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంస్థ అధినేత మండవ ప్రభాకర్ రావుతో దెందులూరు ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిరంతర సేవా కార్యక్రమాలతో నడుస్తున్న చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సేవలను మండవ ప్రభాకర్ అభినందించారు. సామాజిక ప్రగతి ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు.