భీమడోలు విద్యుత్ ఉపకేంద్రంలో కొత్తగా పవర్ ట్రాన్స్ఫార్మర్ మార్పు చేస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి రెండు విడతలుగా వ్యవసాయదారులకు విద్యుత్ సరఫరా చేస్తామని ఈఈ నటరాజన్ బుధవారం అన్నారు. 220/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ఏలూరు, పెదవేగి, ద్వారకాతిరుమల, నారాయణపురం, భీమడోలు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు గురువారం నుంచి నెల రోజుల పాటు రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.