దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలకు ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతమనేని పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చింతమనేని సాలువతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.