ఎక్కువ అనారోగ్య సమస్యలు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత లోపించడం వలన మనకు సంక్రమిస్తాయని కాబట్టి ప్రజలు వ్యక్తిగత, పరిసర పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి పి ఎస్ ఎస్ ప్రసాద్ సూచించారు. దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మసీదుపాడు గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం పట్ల ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన అంటువ్యాధులు వస్తాయన్నారు.