పెదవేగి మండలం కొప్పులవారిగూడెనికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు(45) వట్లూరులో కౌలుకు తీసుకున్న పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. సోమవారం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లుతుండగా వట్లూరు వై-జంక్షన్ వద్ద డీసీఎం వెనుక నుంచి ఢీకొంది. తలకు బలమైన గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.