పెదపాడు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. నాయుడుగూడెం, గుడిపాడు, వడ్డీ గూడెం, సత్యవోలు, కోణికి, గోగుంట, వసంతవాడ, తోటగూడెం, పునుకొల్లు, వీరమ్మ కుంట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.