పెదవేగి మండలం విజయరాయి వద్ద తమ్మిలేరుపై నిర్మించిన బలివే బ్రిడ్జితో పాటు ఘాట్లను చింతమనేని ప్రభాకర్ స్థానిక కూటమి నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ. ఈనెల 26న ప్రారంభం కానున్న మహాశివరాత్రి సందర్భంగా బలివే క్షేత్రంలోని ఆ మహా శివుని దర్శించడానికి వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.