ఎమ్మెల్యే ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

54చూసినవారు
ఎమ్మెల్యే ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
దెందులూరు మండలం కొవ్వలి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని, బాత్రూంలకు తలుపులు బిగించడంతో పాటు దోమల నెట్ డోర్స్ కూడా పెట్టాలని అధికారులకు సూచించారు. దీంతో మంగళవారం జిల్లా అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పనులను ప్రారంభించి దసరా సెలవులు ముగిసేలోపు పూర్తి చేస్తామని సంక్షేమ శాఖ జెడి ప్రకాష్ అన్నారు.

సంబంధిత పోస్ట్