పెదపాడు మండలం వట్లూరులో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని దెందులూరు నియోజకవర్గంలో లాంఛనంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఈ మేరకు స్వయంగా ఇసుక ట్రాక్టర్ ను ఎమ్మెల్యే నడిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాలాభిషేకం చేశారు.