ప్రజా సమస్యలపై వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించటంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మీ కోసం లో ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా లోని అధికారులతో ప్రజల సమస్యలపై చర్చించారు. ప్రతి వారం నియోజకవర్గంలో మండలాల్లో జరిగే మీ కోసం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని తెలిపారు.