కొల్లేటి లంక గ్రామాల్లో జిల్లా ఎస్పీ ప్రశాంతి శివ కిషోర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రామిలేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద నీరు కొల్లేటికి చేరుతుండటంతో వరద ముంపు గురయ్యే ప్రమాదం ఉన్న కోమటి లంక సహా పలు కొల్లేటి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటి తీవ్రతను, చేపట్టవలసిన రక్షణ చర్యలపై చర్చించారు.