పెదవేగి మండలం దుగ్గిరాలలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.