పెదవేగి: దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం

51చూసినవారు
పెదవేగి: దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం
ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి కానుకగా ప్రభుత్వం అందించటం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలకు అన్ని విధాల అండగా నిలుస్తూ వారికి భద్రతతో పాటు ఆర్థిక భరోసా, సంక్షేమం అందించటానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్