భూముల రీ సర్వేపై ముందుగానే రైతులకు తెలియజేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి అన్నారు. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని జేసీ ధాత్రి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కవ్వగుంట గ్రామంలో 1100 ఎకరాల విస్తీర్ణం ఉందని, గ్రామం యూనిట్‌గా 250 ఎకరాలు విస్తీర్ణంతో ఆరు బ్లాకులుగా విభజించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.