పెదవేగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదవేగి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పనులను, అదేవిధంగా వివిధ శాఖల పనితీరును ఎమ్మెల్యే సమీక్షించారు. ఏడాది సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామన్నారు.