పెదవేగి: మామిడి రైతులను ఆదుకోవాలి

51చూసినవారు
పెదవేగి: మామిడి రైతులను ఆదుకోవాలి
ఏలూరు జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవాలని, మామిడి పంటకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలంలోని పెదవేగి, గార్లమడుగు తదితర గ్రామాల్లో మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం మామిడి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్