పెదవేగి: చికిత్స పొందుతూ వివాహిత మృతి

55చూసినవారు
పెదవేగి: చికిత్స పొందుతూ వివాహిత మృతి
పెదవేగి మండలం కొండలరావుపాలేనికి చెందిన కనపర్తి రేణుక (40) భర్తతో విభేదాల కారణంగా కుమార్తెతో కలిసి పుట్టింట్లో ఉంటున్నారు. ఈ నెల 5న కుమార్తెతో ఓ విషయమై గొడవ జరిగి మనస్తాపానికి గురై ఇంట్లోనే ఎలుకల మందు తిన్నారు. కుటుంబ సభ్యులు గమనించి ఏలూరు సర్వజన ఆసుపత్రికి, అక్కణ్నుంచి హైదరాబాద్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

సంబంధిత పోస్ట్