పెదవేగి మండలం వంగూరు గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చంనాయుడుతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే ఎడ్లకు నాగలి కట్టి పొలాన్ని దున్నారు. అనంతరం రైతులకు డ్రోన్ స్ప్రేయర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.