ఏలూరు జిల్లా పెదవేగి మండలం గోపన్నపాలెం నుండి రామసింగవరం వరకు రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న రహదారి అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం రామవరప్పాడులో రూ. 74 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు, సిమెంటు రోడ్డును ప్రారంభించారు.