పెదవేగి మండలం విజయరాయి సెక్షన్ జానంపేట సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల నిమిత్తం జూన్ 13న విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేడ్కర్ గురువారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. జానంపేట, జగన్నాధపురం, సింగవరం, ముత్తనవేడు గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలన్నారు.