పెదవేగి మండలం కూచిపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ లో గురువారం విషాదం చోటుచేసుకుంది. మేడూరి వెంకట సురేష్ (47) పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఉపాధ్యాయులతో మీటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందారు. దీంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.