దెందులూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేనిని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కలుసుకొని వారి సమస్యలను తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.