పెదవేగి మండలం కొండలరావు పాలెం వైసీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా విస్తృతస్థాయి సమావేశం, బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతవరకు ప్రభుత్వంపై స్పందన ఉంటుందో జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.