దెందులూరు నియోజకవర్గానికి 39 వితంతు పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఈ నెల 12న పెదవేగి మండలంలో పెన్షన్లను పంపిణీ చేస్తామని ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వితంతువులకు పెన్షన్లు మంజూరు కాగా, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచనలతో స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.