ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆయనను కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రభాకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.