ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని భీమడోలు ఎంఈఓ 1 ఈదుపల్లి శ్రీనివాసరావు కోరారు. పోలసానిపల్లి పాఠశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు, పాఠశాల నిర్వహణ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని చిన్నారులతో కూర్చుని ఎంఈఓ భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి ఈడు విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.