ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి గురువారం రెండు నామినేషన్లు అందచేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దిడ్ల వీరరాఘవులు, కాకినాడకు చెందిన కాట్రు నాగబాబులు ఒక్కోక్కరు ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి.