ఏలూరు జిల్లాలో 594 ఫోన్లు రికవరీ

82చూసినవారు
ఏలూరు జిల్లాలో 594 ఫోన్లు రికవరీ
గత 3 నెలల కాలంలో సీఈఐఆర్ పోర్టల్‌ ద్వారా ట్రేస్ చేసిన 594 దొంగిలించిన/పోయిన మొబైల్ ఫోన్లు ఏలూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం ఏలూరులో ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ చేతుల మీదుగా ఫోన్‌ల యజమానులకు అందచేశారు. రూ. 71. 28 లక్షలు విలువ చేసే ఫోన్‌లను 15వ విడతగా రికవరీ చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఏటీఎంలు, రైతు బజార్‌లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్