విద్యతోనే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యం

53చూసినవారు
విద్యతోనే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యం
విద్యతోనే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార వేడుకలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన వారిని దుశ్శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.

సంబంధిత పోస్ట్