మూడేళ్ల తర్వాత అమ్మ చెంతకు చేరిన బాలుడు

81చూసినవారు
మూడేళ్ల తర్వాత అమ్మ చెంతకు చేరిన బాలుడు
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ బాలుడు 2021లో ఇంటినుంచి వెళ్లిపోయాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా అక్కడి పోలీసులు చైల్డ్ కేర్ సంస్థలో చేర్చారు. ఈ క్రమంలో బాలుడిది ఏలూరు జిల్లాగా గుర్తించి ఇక్కడి అధికారులను సంప్రదించారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. బాలుడి తల్లిని బుట్టాయగూడెంలో గుర్తించి మంగళవారం అప్పగించారు.

సంబంధిత పోస్ట్