ఏలూరు జిల్లాలో 100 శాతం పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో నగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులకు పెన్షన్ల సొమ్మును పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం నాటికి 95% పెన్షన్ల పంపిణీ పూర్తిచేయడం జరిగిందని అన్నారు.