బుధవారం స్ఫూర్తి భవనంలో ఏలూరు ఏరియా ఏఐటీయూసీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం ఏరియా కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నేతలు బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చిందని విమర్శించారు. కనీస వేతనం రూ 35,000/-గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 16న బైక్ ర్యాలీ, 20న మహా ప్రదర్శన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.