ఏలూరు జడ్పీ కార్యాలయంలో సోమవారం నవ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు.